Share News

MTC: ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడుపుతాం..

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:44 AM

విద్యార్థుల ఫుట్‌ బోర్డు ప్రయాణాన్ని అడ్డుకునేలా ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు

MTC: ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడుపుతాం..

పెరంబూర్‌(చెన్నై): విద్యార్థుల ఫుట్‌ బోర్డు ప్రయాణాన్ని అడ్డుకునేలా ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఎంటీసీ) తెలిపింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి, వచ్చే సమయాల్లో తగినన్ని బస్సులు లేకపోవడంతో ఫుట్‌బోర్డులపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదులపై స్పందించిన ఎంటీసీ, విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం అడ్డుకునేలా కండక్టర్లు, డ్రైవర్లకు పలు సూచనలు చేసింది.

- ఎంటీసీ బస్సుల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించవద్దని విద్యార్థులకు కండక్టర్లు, డ్రైవర్లు ఆయా బస్టాపుల్లో తెలియజేస్తూ ఉండాలి.

-ఫ అలాగే, ఫుట్‌ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలి.

-ఫ ప్రమాదకరంగా ఫుట్‌బోర్డులపై ప్రయాణిస్తున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత విద్యా సంస్థ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాయాలి.

- ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపుతూ, పాఠశాల సమీపంలో బస్సులు నిలపడం లేదనే ఫిర్యాదులు సత్వరం పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

nani8.2.jpg

Updated Date - Dec 17 , 2023 | 10:44 AM