Monu Manesar: భివానీ జంట హత్యలు, నుహ్ ఘర్షణల్లో నా పాత్ర లేదు..!

ABN , First Publish Date - 2023-08-02T19:59:57+05:30 IST

హర్యానాలోని నుహ్‌లో జరిగిన వీహెచ్‌పీ ఊరేగింపులో తాను పాల్గొనలేదని భజరంగ్ దళ్ గోసంరక్షకుడు మోనూ మానేసర్ తెలిపారు. మత ఘర్షణలకు దారితీసేలా తాను ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయలేదని అన్నారు. రాజస్థాన్‌లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు ముస్లింలను నరకిచంపిన భివానీ జంట హత్య కేసులో కూడా తన ప్రమేయం లేదని చెప్పారు.

Monu Manesar: భివానీ జంట హత్యలు, నుహ్ ఘర్షణల్లో నా పాత్ర లేదు..!

న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్‌ (Nuh)లో జరిగిన వీహెచ్‌పీ ఊరేగింపులో తాను పాల్గొనలేదని భజరంగ్ దళ్ గోసంరక్షకుడు మోనూ మానేసర్ (Monu Manesar) తెలిపారు. మత ఘర్షణలకు దారితీసేలా తాను ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయలేదని అన్నారు. రాజస్థాన్‌లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు ముస్లింలను నరకిచంపిన భివానీ జంట హత్య కేసులో కూడా తన ప్రమేయం లేదని చెప్పారు. నుహ్ జిల్లాల్లో ఆరుగురికి మృతికి కారణమైన అల్లర్ల ఘటన చోటుచేసుకోగానే మోనూ మానేసర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన నుహ్ ఊరేగింపులో తాను పాల్గొనలేదని ఒక మీడియో సంస్థకు ఫోనులో తెలిపారు. భివానీలో జంట హత్య కేసు వెలుగు చూసినప్పటి నుంచి మోనూ మానేసర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.


''హర్యానాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. వీహెచ్‌పీ ఊరేగింపు హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో ప్రతి ఏటా జరుగుతోంది. గోవుల అక్రమ రవాణా స్మగ్లర్లే హర్యానా హింసలో నా పేరును హైలైట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారు'' అని మానేసర్ తెలిపారు. బివానీ జంట హత్యల కేసులో రాజస్థాన్ పోలీసులు సమగ్ర విచారణ జరుపుతారనే నమ్మకం తనకు ఉందని, ఈ హత్యల్లో తన ప్రమేయం లేదని చాలా స్పష్టంగా సోషల్ మీడియో వేదకగా రెండు వీడియోలను షేర్ చేశానని చెప్పారు.

Updated Date - 2023-08-02T19:59:57+05:30 IST