Share News

PM modi: పీఎంజీకేఏవై పథకంపై మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-29T14:30:04+05:30 IST

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

PM modi: పీఎంజీకేఏవై పథకంపై మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పీఎంజీకేఏవై కింద అంత్యోదయ అన్నయోజన (AAY) హౌస్‌హోల్డ్స్, ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ (PHH) లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించే ఈ పథకం 2023 జనవరి 1 న ప్రారంభించారు.


కాగా, పీఎంజీకేఏవై పథకం పొడిగింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. పేదరికపు రేఖకు ఎగువకు చేరిన వారి సంఖ్య గత ఐదేళ్లలో 13.50 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రవేశపెట్టారని, దీనిని 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని నిర్ణయించారని తెలిపారు.


గత ఏడాది డిసెంబర్‌లో పీఎంజీకేఏవైని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)తో విలీనం చేయాలని కేంద్రం నిర్మయం తీసుకుంది. ఎన్ఎఫ్‌సీఏ కింద 75 శాతం గ్రామీణ జనాభా, 50 శాతం పట్టణ జనాభాను ఏఏవై, పీహెచ్‌హెచ్ అనే రెండు కేటగిరిల్లోకి తెచ్చారు.

Updated Date - 2023-11-29T14:30:06+05:30 IST