Share News

Rajasthan: రాజస్థాన్‌లో మైనర్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారం.. గహ్లోత్ సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ

ABN , First Publish Date - 2023-11-22T12:31:38+05:30 IST

రాజస్థాన్(Rajasthan) లో మహిళల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా మైనర్ పై(Minor) ముగ్గురు అత్యాచారం చేశారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Rajasthan: రాజస్థాన్‌లో మైనర్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారం.. గహ్లోత్ సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ

జైపుర్: రాజస్థాన్(Rajasthan) లో మహిళల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా మైనర్ పై(Minor) ముగ్గురు అత్యాచారం చేశారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుచమన్ జిల్లాలోని లడ్నూన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికను(16) ఇంట్లో నుంచి ముగ్గురు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో ముగ్గురు యువకులు కుమార్తెను ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారని బాధిత బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 1:00 గంటల ప్రాంతంలో బాలికను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు.

బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో.. "11:30 గంటలకు తలుపు దగ్గర శబ్దం విన్నప్పుడు, బయటికి వెళ్లి చూడగా గేటు తెరిచి ఉంది. ఇంట్లో చూసే సరికి చిన్నారి కనిపించలేదు. బయటకు వచ్చి వెతికినా అమ్మాయి ఆచూకీ కనిపించలేదు. అనంతరం స్థానికుల సాయంతో బాలిక కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి 1:00 గంటలకు ఓ కారు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు నా కూతుర్ని రోడ్డు మీద పడేశాడు. స్థానికులు కారును వెంబడించగా నిందితులు పరారయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలి' అని వాపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బాధితురాలికి లడ్నూన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.


ప్రజల నిరసనలు..

గ్యాంగ్ రేప్ ఘటన తెలుసుకుని లడ్నూన్ ప్రభుత్వాసుపత్రి ఎదుట పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు తెలిపారు. వారికి బీజేపీ(BJP) అభ్యర్థులు కర్ని సింగ్, మంజీత్ పాల్ సింగ్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

అశోక్ గహ్లోత్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమని బీజేపీ నేతలు విమర్శించారు. బాధిత బాలికకు న్యాయం చేసేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-22T12:31:39+05:30 IST