Minister: విద్యార్థులకు ఉచిత సైకిళ్లపై సీఎంతో చర్చిస్తా..
ABN , First Publish Date - 2023-12-08T11:43:07+05:30 IST
విద్యార్థులకు ఉచితంగా సైకి ళ్లు అందించే విషయమై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని విద్యాశాఖ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఉచితంగా సైకి ళ్లు అందించే విషయమై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప(Minister Madhubangarappa) తెలిపారు. శాసనసభలో గురువారం కాంగ్రెస్ సభ్యుడు ప్రదీప్ ఈశ్వర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను ఉచిత సైకిళ్లు అందించలేమన్నారు. విద్యాసంవత్సరం మరో నాలుగునెలలో ముగియనుందన్నారు. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రదేశాలు అనే తేడా లేకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు ఉందన్నారు.