Share News

Minister: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. రఫేల్‌ వాచీ ధరించిన గొర్రెల కాపరి కథే చెబుతున్నా..

ABN , First Publish Date - 2023-11-26T08:39:10+05:30 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai), రాష్ట్ర మంత్రి మనో తంగరాజ్‌(Minister Mano Thangaraj)ల మధ్య

Minister: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. రఫేల్‌ వాచీ ధరించిన గొర్రెల కాపరి కథే చెబుతున్నా..

- ఉత్తరాది కూలీకి ఆధారం ఉంది..

- అన్నామలైకి మంత్రి మనో తంగరాజ్‌ సమాధానం

అడయార్‌(చెన్నై): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai), రాష్ట్ర మంత్రి మనో తంగరాజ్‌(Minister Mano Thangaraj)ల మధ్య వాగ్వాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రి మనో తంగరాజ్‌కు అన్నామలై 48 గంటల డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో మంత్రి కూడా దీటుగా స్పందించారు. ‘ఉత్తరాది కూలీ’ అనడానికి బలమైన ఆధారం తన వద్ద ఉందని మంత్రి ప్రకటించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరి మధ్య వాదోపవాదాలు తారస్థాయికి చేరడానికి గల కారణాలను పరిశీలిస్తే... రాష్ట్ర ప్రభుత్వ పాడి ఉత్పత్తుల సంస్థ ఆవిన్‌ తయారుచేసే పాల ప్యాకెట్లలో బ్లూ ప్యాకెట్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. పోషక గుణాలు అధికంగా కలిగిన ఈ పాలను నిలిపివేసి, పోషక గుణాలు తక్కువగా ఉండే పాల ప్యాకెట్లను ఆవిన్‌ సంస్థ ప్రవేశపెట్టాలని భావించింది. ఈ నిర్ణయాన్ని అన్నామలై తప్పుబడుతూ తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై ఆయన అనేక ఆరోపణలు చేస్తూ పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. అలాగే కొత్త పాల ప్యాకెట్ల నాణ్యతను కూడా ప్రశ్నించారు. దీనికి మంత్రి మనో తంగరాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘కొందరు ఉత్తరాది కూలీలు’ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆవిన్‌ సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఇక్కడ మంత్రి మనో తంగరాజ్‌ ఉత్తరాది కూలీలు అంటూ చేసిన వ్యాఖ్యలపై అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ ఉత్తరాది కూలీకి సంబంధించి ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందుకోసం 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, క్షమాపణ చెప్పాలని అన్నామలై డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి మనో తంగరాజ్‌ మరోమారు స్పందించారు. ‘రఫేల్‌ వాచ్‌ ధరించిన గొర్రెల కాపరి కథే చెబుతున్నా. తమ్ముడు అన్నామలై అత్యుత్సాహంతో ముందుకు వచ్చి ఆ గొర్రెల కాపరిని తానే అంటూ చెప్పడం వెనుక అంతర్యం ఏంటి? క్షమాపణ చెప్పకుంటే ఏం చేస్తారు? తల నరికేస్తారా? 48 గంటల డెడ్‌లైన్‌.. ఇది బెదిరింపా? నా అభిప్రాయంలో ఎలాంటి మార్పులేదు. పక్కా ఆధారాలతోనే మాట్లాడాను. తమిళనాడు రాష్ట్ర ప్రజలు, పాడి రైతుల సంక్షేమానికి సంబంధించిన విషయం. క్షమాపణ కోరడానికి మేము సావర్కర్ల వంశం కాదు. పెరియార్‌ మనవలం. కలైంజర్‌ సైనికులం. దళపతి సోదరులం. తమిళనాడు ప్రజల కోసం శ్రమించే శ్రమజీవులం’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

nani4.3.jpg

Updated Date - 2023-11-26T08:39:12+05:30 IST