Minister of Health: ఆరోగ్యశాఖ మంత్రి అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-06-25T08:30:00+05:30 IST

మంత్రి సెంథిల్‌ బాలాజీ బైపాస్‌ సర్జరీపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramania

Minister of Health: ఆరోగ్యశాఖ మంత్రి అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

పెరంబూర్‌(చెన్నై): మంత్రి సెంథిల్‌ బాలాజీ బైపాస్‌ సర్జరీపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తీవ్రంగా ఖండించారు. మంత్రికి ఆపరేషన్‌ థియేటర్‌లో కాకుండా నెహ్రూ స్టేడియంలో 15 వేల మంది ముందు చేయాలా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి9Former Chief Minister Karunanidhi) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని 11 ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 103 చోట్ల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక పుళియూర్‌లో వున్న ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని మంత్రి సుబ్రమణ్యం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్‌, యూరిన్‌, ఎకో, ఈసీజీ, బెస్ట్‌ కాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు, చర్య వ్యాధులు సహా పలు వైద్య పరీక్షలు ఉచితంగా చేపట్టగా, ఒక్కో శిబిరంలో 2 వేల మందికి పైగా పాల్గొని పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అలాగే, జనరల్‌ చికిత్సలు, పలు వ్యాధులకు సలహాలు, మానసిక కౌన్సిలింగ్‌ తదితరాలు అందజేశామన్నారు. కరుణానిధి అమలుచేసిన పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. మంత్రి సెంథిల్‌ బాలాజికి రెండ్రోజుల క్రితం బైపాస్‌ సర్జరీ(Bypass surgery) నిర్వహించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయనకు ఆపరేషన్‌ చేసిన విధానంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మనిషికి ఆరోగ్యం బాగా లేకపోయినా, దానిపై కూడా ఆరోపణలు చేయడం సరి కాదని హితవు పలికారు.

nani3.jpg

హ్యూస్టన్‌ వర్శిటీలో తమిళ పీఠం పనులు ఎప్పుడో ప్రారంభించాం

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో కేంద్రప్రభుత్వ నిధులతో తమిళ పీఠం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడంపై మంత్రి సుబ్రమణ్యం స్పందిస్తూ.. అక్కడ తమిళపీఠం ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ విషయమై ఆ వర్శిటీ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌, తమిళ భాషాభివృద్ధి శాఖ మంత్రిని ఆహ్వానిస్తూ నాలుగు, ఐదు లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు.

Updated Date - 2023-06-25T08:30:00+05:30 IST