Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు..

ABN , First Publish Date - 2023-06-02T08:13:47+05:30 IST

కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మెకెదాటు డ్యాం నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తే లేదని మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) స్పష్టం

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు..

వేలూరు(చెన్నై): కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మెకెదాటు డ్యాం నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తే లేదని మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) స్పష్టం చేశారు. గురువారం స్థానికంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కాట్పాడిలోని 45 దేవాలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, మెకెదాటు డ్యాం(Mekedatu Dam) నిర్మాణంతో డెల్టా రైతులు ఇబ్బందులు పడతారన్నారు. డ్యాం నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. అదే సమయంలో డ్యాంపై చర్చలు చేపడతామనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌(Karnataka Deputy Chief Minister Sivakumar) చేసిన ప్రకటనను తాము స్వాగతించమని, డ్యాం నిర్మాణంపై చర్చలకు ఆస్కారం లేదని మంత్రి దురైమురుగన్‌ స్పష్టం చేశారు. మంత్రి వెంట ధర్మకర్త కమిటీ చైర్మెన్‌ అశోకన్‌, వేలూరు ఎంపీ కదిర్‌ ఆనంద్‌, ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-06-02T08:13:47+05:30 IST