Minister: మంత్రి సంచలన ప్రకటన.. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను రద్దు చేస్తాం...
ABN , First Publish Date - 2023-09-18T12:45:44+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్(RSS) శాఖలను రద్దు చేస్తామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge)

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్(RSS) శాఖలను రద్దు చేస్తామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge) వెల్లడించారు. కలబురగిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు విద్యాసంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు ఉన్నాయన్నారు. పలు పోలీస్ స్టేషన్‌లలోనూ కాషాయం కండువాలు వేసు కున్న సందర్భాలు గతంలో కొనసాగాయన్నారు. అటువంటి శాఖలను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. గత ఏడాది ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ విద్యాసంస్థలు, కార్యా లయాలు, పోలీస్‌స్టేషన్‌లలోనూ పతాకావిష్కరణ చేసిందన్నారు. అటువంటి కార్యకలాపాలు ఇకపై కొనసాగవన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడేందుకు నాకెటువంటి భయం లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యాకేంద్రాలుగా ఉండాలని కానీ రాజకీయ అడ్డా కారాదన్నారు. ప్రియాంకఖర్గే వ్యాఖ్యలపై నెటిజన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను మూసివేసి ఐసిస్ సంస్థలు తెరుస్తారా..? అంటూ ప్రశ్నించారు. అధికారం దక్కిందని దర్పం చూపరాదన్నారు. ప్రియాంక ఖర్గే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని, నిరంతరంగా ఆర్‌ఎస్‌ఎస్ మండిపడుతుంటారనే కామెంట్‌లు వచ్చాయి.