Minister: ఆ పరీక్షల్లో హిజాబ్‌కు అనుమతి లేదు

ABN , First Publish Date - 2023-03-05T11:18:41+05:30 IST

రాష్ట్రంలో ఈనెల 9న ప్రారంభం కానున్న ద్వితీయ పీయూసీ పరీక్షల్లో హిజాబ్‌ సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలతో కూడిన దుస్తులతో హాజరయ్యేందుకు అనుమతి

Minister: ఆ పరీక్షల్లో హిజాబ్‌కు అనుమతి లేదు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 9న ప్రారంభం కానున్న ద్వితీయ పీయూసీ పరీక్షల్లో హిజాబ్‌ సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలతో కూడిన దుస్తులతో హాజరయ్యేందుకు అనుమతి ఉండదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌(Minister BC Nagesh) పేర్కొన్నారు. తిపటూరు తాలూకాలో శనివారం నాడకచేరీ కార్యాలయానికి భూమిపూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిజాబ్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అంతకంటే ఎక్కువగా వ్యాఖ్యానించేందుకు సాధ్యం కాదన్నారు. కాగా రాష్ట్రంలో గుర్తింపు లేకుండా అనధికారికంగా చలామణిలో ఉన్న పాఠశాలల సమాచారం సేకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఏడాది పరీక్షల ప్రక్రియ ముగిసిన అనంతరం చట్టవ్యతిరేకంగా నడుస్తున్న పాఠశాలల జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌(Website)లో పొందుపరచాలని నిర్ణయించామన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో ఇది వారికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ద్వితీయ పీయూసీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - 2023-03-05T11:18:41+05:30 IST