Minister: ఆ నగదును రుణాలకు జమ చేసుకోవద్దు: మంత్రి

ABN , First Publish Date - 2023-09-18T10:23:54+05:30 IST

రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అందజేస్తున్న ‘కలైంజర్‌ మహిళా సాధికారిక’ పథక నగదును తమ నిర్వహణ కారణాలతో జమ చేసుకోవద్దని

Minister: ఆ నగదును రుణాలకు జమ చేసుకోవద్దు: మంత్రి

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అందజేస్తున్న ‘కలైంజర్‌ మహిళా సాధికారిక’ పథక నగదును తమ నిర్వహణ కారణాలతో జమ చేసుకోవద్దని రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తెన్నరసు(State Finance Minister Thangam Thennarasu) బ్యాంకులను కోరారు. అంతేగాక ఈ విషయంపై కేంద్ర ఆర్థికశాఖకు కూడా లేఖ రాస్తామని మంత్రి పేర్కొన్నారు. అన్నాదురై జయంతి సందర్భంగా ఈనెల 15వ తేది 1.06 కోట్ల మంది మహిళలకు ‘కలైంజర్‌ మహిళ సాధికారిక’ పథకాన్ని సీఎం స్టాలిన్‌ ప్రారంభించారని, తొలిరోజే సుమారు కోటిమంది మహిళల ఖాతాల్లో నగదు జమ అయ్యిందన్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీపై పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. మహిళల ఖాతాల్లో జమ చేసిన నగదును బ్యాంక్‌ సేవల రుసుము, గతంలో తీసుకున్న రుణానికి జమ చేస్తున్నారని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఈ విషయమై రాష్ట్ర బ్యాంకులతో నిర్వహించిన సమావేశంలో, ఈ పథకంలో అందజేసే నగదును జమ చేసుకోరాదని సూచించామన్నారు. కానీ, కొన్ని బ్యాంకులు ఈ సూచన పాటించడం లేదని తెలుస్తోందన్నారు. ఈ పథకంలో మహిళలకు అందజేస్తున్న నగదును నిర్వహణ కారణాలు, రుణ బకాయిల కింద జమ చేయరాదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాయనున్నామని తెలిపారు. ఒకవేళ బ్యాంకులు నగదును జమ చేసుకున్నట్లయితే లబ్ధిదారులు ‘1100’ అనే నెంబరుకు ఫిర్యాదు చేయాలని, వాటిపై సత్వరం చర్యలు చేపడతామని మంత్రి తంగం తెన్నరసు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-09-18T10:23:54+05:30 IST