Minister: ఆ ఆలయానికి కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మాణం..

ABN , First Publish Date - 2023-05-05T12:01:41+05:30 IST

తిరుత్తణి పర్వత ఆలయానికి భక్తులు సులువుగా చేరేలా కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మించేందుకు పరిశీలిస్తున్నట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి

Minister: ఆ ఆలయానికి కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మాణం..

ప్యారీస్‌(చెన్నై): తిరువళ్లూర్‌ జిల్లాలో ప్రసిద్ధిచెందిన తిరుత్తణి పర్వత ఆలయానికి భక్తులు సులువుగా చేరేలా కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మించేందుకు పరిశీలిస్తున్నట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు. నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో గురువారం ఉదయం మంత్రి శేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, అటవీ, రహదారులు, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, ఆమోదించిన తీర్మానాలను మంత్రి సమావేశం అనంతరం మీడియాకు వివరించారు. తిరుత్తణి సుబ్రమణ్యస్వామి(Tiruthani Subramaniaswamy) ఆలయానికి పలు ప్రాంతాల నుంచి ఏడాది పొడువునా భక్తులు వెళ్తున్నారని, వారికి మరిన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. రాజగోపురం లింక్‌ రోడ్డు, కొత్తగా నిర్మిస్తున్న ఐదు కల్యాణ మండపాలు, సిబ్బంది శిక్షణ కేంద్రం, ఘాట్‌ రోడ్డులో విద్యుద్దీపాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2023-05-05T12:01:41+05:30 IST