Minister: 24 నుంచి ‘బెంగళూరు హబ్బ’

ABN , First Publish Date - 2023-03-01T12:37:15+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాల్లో మార్చి 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు బెంగళూరు

Minister: 24 నుంచి ‘బెంగళూరు హబ్బ’

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరంలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాల్లో మార్చి 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు బెంగళూరు హబ్బను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి కే గోపాలయ్య(Minister K Gopalaiah) నగరంలో మంగళవారం మీడి యాకు చెప్పారు. విధానసౌధ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న బసవణ్ణ, నాడప్రభు కెంపేగౌడ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 23న జరుగనుందని అదే రోజు బెంగళూరు హబ్బకు కూడా సాంకేతికంగా శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. అనంతరం నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బెంగళూరు హబ్బ జోరుగా సాగుతుందన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా జానపద క్రీడోత్సవాలు, ఎండ్ల బండ్ల పోటీలు, సైకిల్‌, ద్విచక్ర వాహనాల జాథా, వింటేజ్‌ కార్ల ర్యాలీ, ఆహార మేళా కబ్బన్‌ పార్కు, లాల్‌బాగ్‌లలో సాంస్కృతిక ఉత్సవాలు ఉంటాయన్నారు. నగరంలోని ప్రధాన చెరువులు, పార్కులలోనూ ఈ ఉత్సవాలను జరుపుతామన్నారు. ఇదే సందర్భంగా పుస్తకమేళా, చిత్రలేఖన పోటీలను కూడా నిర్వహిస్తామన్నారు. కాగా బసవణ్ణ, కెంపెగౌడ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీగానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గానీ హాజరయ్యే అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు.

ఇదికూడా చదవండి: ఇంతకాలం ఆ ఆప్యాయత ఏమైందో...

Updated Date - 2023-03-01T12:40:04+05:30 IST