Metro Rail: నేటి అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైల్ సేవలు
ABN , First Publish Date - 2023-03-18T12:39:10+05:30 IST
నగరంలో రెండు మార్గాల్లో తిరిగే మెట్రో రైల్(Metro Rail) సర్వీసులు ఈ నెల 18వ తేదీన అర్ధ రాత్రి వరకు అంటుబాటులో ఉంటాయని చెన్నై మెట్రో రైల్ కా

అడయార్(చెన్నై): నగరంలో రెండు మార్గాల్లో తిరిగే మెట్రో రైల్(Metro Rail) సర్వీసులు ఈ నెల 18వ తేదీన అర్ధ రాత్రి వరకు అంటుబాటులో ఉంటాయని చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) తెలిపింది. ఇదే విషయంపై శుక్రవారం సీఎంఆర్‌ఎల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. చెన్నై మెట్రోరైల్ బాహ్య భాగస్వామి అయిన మార్గ్ కంపెనీ సహకారంతో ఈ నెల 19వ తేదీన నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం(Nehru Indoor Stadium)లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత కచ్చేరి రాత్రి 7 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరుగనున్నందున, ఈ సంగీత విభావరిని తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులు, నగర వాసులు సౌకర్యార్థం ఈ నెల 18వ తేదీన అర్ధ రాత్రి 12 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుపనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు టిక్కెట్లను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కొనుగోలు చేసి 20 శాతం రాయితీని పొందవచ్చని తెలిపింది.