Metro Rail: 75 రోజుల్లో మెట్రో రైల్‌ డీపీఆర్‌

ABN , First Publish Date - 2023-02-25T08:05:30+05:30 IST

మదురై మెట్రో రైల్‌(Madurai Metro Rail) ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక (డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు - డీపీఆర్‌)ను 75 రోజుల్లో తయారుచేస్తామని

Metro Rail: 75 రోజుల్లో మెట్రో రైల్‌ డీపీఆర్‌

- సీఎంఆర్‌ఎల్‌ అధికారుల వెల్లడి

అడయార్‌(చెన్నై): మదురై మెట్రో రైల్‌(Madurai Metro Rail) ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక (డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు - డీపీఆర్‌)ను 75 రోజుల్లో తయారుచేస్తామని చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) ఉన్నతాధికారులు వెల్లడించారు. చెన్నై మహానగరంలో ప్రస్తుతం రెండు మార్గాల్లో 54 కిలోమీటర్ల మేరకు మెట్రో రైళ్ళు నడుస్తున్నాయి. మెట్రో రైళ్లకు ఆదరణ లభిస్తుండడంతో మదురై, కోవై నగరాల్లో కూడా మెట్రో ప్రాజెక్టులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సీఎంఆర్‌ఎల్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ అర్జునన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మెట్రోరైల్‌ సేవలకు చెన్నై(Chennai)లో ఆదరణ అమోఘంగా ఉందన్నారు. దీంతో మదురైలో కూడా మెట్రో రైల్‌ సేలను అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం డీపీఆర్‌ను 75 రోజుల్లో తయారు చేస్తామని తెలిపారు. డీపీఆర్‌ తయారీకి సంస్థను ఎంపిక చేసిన తర్వాత 75 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. మదురై మోట్రో రైల్‌ తొలి దశ ప్రాజెక్టులో భాగంగా 35 కిలోమీటర్లలో 18 మెట్రో స్టేషన్లతో నిర్మించేలా ప్లాన్‌ చేస్తున్నట్టు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-25T08:05:32+05:30 IST