Modi receives death threat: మోదీని చంపుతామంటూ బెదరింపు కాల్

ABN , First Publish Date - 2023-06-21T14:26:22+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లను చంపుతానంటూ ఒక అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. ఢిల్లీ పోలీసులకు ఈ మేరకు బుధవారం రెండు బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. కాలర్‌ను గుర్తించేందుకు పోలీసులు వెంటనే ఒక టీమ్‌ను రంగంలోకి దింపారు.

Modi receives death threat: మోదీని చంపుతామంటూ బెదరింపు కాల్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)లను చంపుతానంటూ (death threat) ఒక అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. ఢిల్లీ పోలీసులకు ఈ మేరకు బుధవారం రెండు బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. కాలర్‌ను గుర్తించేందుకు పోలీసులు వెంటనే ఒక టీమ్‌ను రంగంలోకి దింపారు.

పోలీసుల కథనం ప్రకారం, ఉదయం 10.46 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే బీహార్ ముఖ్యమంత్రిని చంపుతామంటూ ఆ వ్యక్తి బెదిరించాడు. నాంగ్లోయీ (Nagloi) ప్రాంతం నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తిరిగి 10.54 గంటలకు అదే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి రూ.2 కోట్లు ఇవ్వకుంటే ప్రధానమంత్రి మోదీని, హోం మంత్రి అమిత్‌షాను చంపుతామంటూ అతను బెదిరించాడు. పశ్చిమ విహార్ (ఈస్ట్) ప్రాంతం నుంచి మొబైల్‌‌ నుంచి ఈ కాల్ వచ్చినట్టు గుర్తించారు. ఆ వెంటనే పశ్చిమ వివాహార్ ఈస్ట్ ఎస్‌హెచ్ఓ నలుగురు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మథిపూర్ నివాసి సుధీర్ శర్మగా గుర్తించారు. అతను కార్పెంట్ పని చేస్తుంచాడు. పోలీసులు అతని ఇంటికి చేరేసరికి సుధీర్ అందుబాటులో లేడు. అతని పదేళ్ల కుమారుడు అంకిత్ కనిపించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడని దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, గత మేలోనూ ప్రధానమంత్రిని చంపుతామంటూ బెదిరించిన ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసి ఢిల్లీ ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. తాగిన మైకంలో అతను ఈ బెదరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.


******************************

ఇవి కూడా చదవండి..

******************************

Mumbai Covid Scam: ఆదిత్యా థాక్రే సన్నిహితుల ఇండ్లలో ఈడీసోదాలు

******************************

Minister: ఇకనుంచి ఎన్‌ఈపీ కాదు.. ఎస్‌ఈపీ అమలు చేస్తాం: మంత్రి

******************************



Updated Date - 2023-06-21T15:08:53+05:30 IST