Threaten to murder Modi: మోదీని హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్
ABN , First Publish Date - 2023-05-26T10:45:12+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ ఫోన్ కాల్ చేయడంతో పోలీసు శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఫోన్ ట్రేస్ చేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ప్రసాద్ నగర్‌కు చెందిన ఒకరిని అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi)ని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారంనాడు బెదిరింపు ఫోన్ కాల్ (Threatening call) వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ ఫోన్ కాల్ రావడంతో పోలీసు శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కునేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ప్రసాద్ నగర్‌కు చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని య్‌గర్ పురకు చెందిన హేమంత్‌గా గుర్తించారు. తప్పతాగిన స్థితిలో అతను ఫోన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
పీసీఆర్ కాల్ అందగానే ఒక టీమ్‌ను రంగంలోకి దింపామని, కాలర్‌ను కరోల్ బాగ్‌కు చెదిన 48 ఏళ్ల హేమంత్ కుమార్‌గా గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా నిరుద్యోగిగా ఉన్నాడని, తాగుడు అలవాటు ఉందని చెప్పారు. కాగా, మరిన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి.