Taj Hotel terror threat: ముంబై తాజ్ హోటల్‌కు బెదిరింపు కాల్

ABN , First Publish Date - 2023-09-01T17:12:37+05:30 IST

దక్షిణ ముంబై లోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌ పై ఉగ్రదాడి జరుగనుందంటూ బెదరింపు కాల్ చేసిన 36 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేలింది.

Taj Hotel terror threat: ముంబై తాజ్ హోటల్‌కు బెదిరింపు కాల్

ముంబై: దక్షిణ ముంబై (Mumbai)లోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌ (Taj Hotel)పై ఉగ్రదాడి (Terror Attack) జరుగనుందంటూ బెదరింపు కాల్ చేసిన 36 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేలింది.


సంఘటన వివరాల ప్రకారం, తనను తాను ముఖేష్ సింగ్‌గా పరిచయడం చేసుకుంటూ అజ్ఞాత వ్యక్తి గురువారం రాత్రి సిటీ పోలీస్ ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. 26/11 దాడుల్లో హోటల్ తాజ్‌‌ను టార్గెట్ చేసుకున్నట్టే ఈసారి కూడా తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడి జరిపిందేకు ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు సముద్రమార్గం ద్వారా ముంబైలోకి అడుగుపెట్టినట్టు చెప్పాడు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. కాలర్‌ను శాంతాక్రుజ్‌లో గుర్తించి అరెస్టు చేశారు. అతనిని గోలిబార్ రోడ్డులో నివాసం ఉంటున్న జగదాంబ ప్రసాద్ సింగ్‌గా గుర్తించారు. అతనిని శాంతాక్రుజ్ పోలీసులకు అప్పగించగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసారనే కారణంగా ఐపీసీ 505(1) (B)కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-09-01T17:12:37+05:30 IST