Liquor stores: 500 మద్యం దుకాణాల మూత.. కారణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-16T08:09:43+05:30 IST

రాష్ట్రంలో తొలివిడతగా మొత్తం 500 మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Liquor stores: 500 మద్యం దుకాణాల మూత.. కారణమేంటో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని 500 దుకాణాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితం డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొంది. డీఎంకే గత రెండేళ్ల పాలనలో టాస్మాక్‌ దుకాణాలను మూయడానికి బదులుగా అదనంగా ఎలైట్‌ షాపులు, బార్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 3న కరుణ శతజయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా టాస్మాక్‌ దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నిర్ణయించారు. తొలివిడతగా 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు టాస్మాక్‌ ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూతపడతాయని తెలుస్తోంది. అదేవిధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం(Liquor shop) కొనసాగేలా టాస్మాక్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - 2023-05-16T08:09:43+05:30 IST