Share News

Kunwar Danish Ali: హిమంత బిశ్వ శర్మకు మెదకు చితికినట్టుంది.. బాంబ్ బ్లాస్ట్ వ్యాఖ్యలపై డానిష్ అలీ వ్యంగ్యాస్త్రాలు

ABN , First Publish Date - 2023-11-12T23:00:29+05:30 IST

Himanta Biswa Sarma: కాంగ్రెస్‌పై నిందారోపణలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే బీజేపీ నాయకుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (ముఖ్యంగా మణిపూర్ సంక్షోభం) జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్క మాట మాట్లాడని ఆయన.. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందు వరుసలో

Kunwar Danish Ali: హిమంత బిశ్వ శర్మకు మెదకు చితికినట్టుంది.. బాంబ్ బ్లాస్ట్ వ్యాఖ్యలపై డానిష్ అలీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్‌పై నిందారోపణలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే బీజేపీ నాయకుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (ముఖ్యంగా మణిపూర్ సంక్షోభం) జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్క మాట మాట్లాడని ఆయన.. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారాల్లో ఆయన అదే పని చేస్తున్నాడు. తమ బీజేపీ మాత్రమే మంచి పనులు చేసిందని గొప్పలకు పోతూ.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ హయాంలో దేశంలో దాడులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తాజాగా బీఎస్‌పీ ఎంపీ డానిష్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిమంత మెదడు చితికిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘హిమంత బిశ్వ శర్మ మాటల్ని బట్టి చూస్తుంటే.. ఆయన జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా ఉందని అనిపిస్తోంది. లేకపోతే ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుస్తోంది. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆయనకు జ్ఞాపకశక్తి లోపించడం వల్లే ఈ దాడుల గురించి మర్చిపోయినట్టున్నారు’’ అంటూ డానిష్ అలీ కౌంటర్ ఎటాక్ చేశారు. పార్లమెంట్ దాడుల సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారని, లాల్ కృష్ణ అద్వానీ హోంమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. మైక్ దొరికింది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదని చురకలేసిన అలీ.. బీజేపీకి చరిత్ర, భౌగోళిక శాస్త్రం గురించి ఏమీ తెలియదని దుయ్యబట్టారు. ఏదైనా ఆరోపణలు చేసే ముందు.. చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడండని సూచించారు.


ఇంతకీ హిమంత బిశ్వ శర్మ ఏం చెప్పారు?

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్మదాపురంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ‘‘2009-10 కాలంలో దేశంలో ప్రతిరోజూ పేలుళ్లు జరిగేవి. ముంబై, పార్లమెంటుపై దాడులు జరిగేవి. ఆ సమయంలో సైన్యం లేదా? కాంగ్రెస్ అప్పుడే పాకిస్తాన్‌కి గుణపాఠం చెప్పి ఉంటే.. వేలాది మంది ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లం’’ అని అన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక.. పాకిస్థాన్‌లోకి ప్రవేశించి రెండుసార్లు దాడులు చేశామని అన్నారు. ఇంత మాట్లాడే హిమంతకు.. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న సంక్షోభం కనిపించడం లేదా? ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీనే కదా? మరి.. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేతలు గట్టిగా నిలదీస్తారు.

Updated Date - 2023-11-12T23:00:30+05:30 IST