Karnataka Results: బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి బొమ్మై రాజీనామా

ABN , First Publish Date - 2023-05-13T22:55:31+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఈజీగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. అధికార బీజేపీ కనీసం 70 స్థానాలు కూడా సాధించలేక చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలో..

Karnataka Results: బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి బొమ్మై రాజీనామా

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఈజీగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. అధికార బీజేపీ కనీసం 70 స్థానాలు కూడా సాధించలేక చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలో తుది ఫలితాలకు ముందే కర్ణాటక సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. సీఎం పదవికి బస్వరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) రాజీనామా(Resigns) చేశారు. బొమ్మై తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. కాగా కర్ణాటక కాబోయే సీఎం సిద్ధరామయ్య? లేక డీకే శివకుమారా? అనేది ప్రశ్నగా మిగిలింది.

ఎన్నికల సంఘం తాజా నివేదిక ప్రకారం బీజేపీ 64 సీట్లను మాత్రమే గెలుచుకుంది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కింగ్ మేకర్ అవుతామని ప్రకటించిన జేడీఎస్ నేతలకు నిరాశే మిగిలింది. జేడీఎస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మేం ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోవడంతోపాటు ఎక్కడ లోపాలు తలెత్తాయో విశ్లేషించుకుంటామని బస్వరాజ్ బొమ్మ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T22:56:44+05:30 IST