Kamal Haasan: 19 నుంచి కమల్‌హాసన్‌ ప్రచారం

ABN , First Publish Date - 2023-02-12T10:07:26+05:30 IST

‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌(Kamal Haasan) ఈ నెల 19వ తేదీ నుంచి ఈరోడ్డు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌

Kamal Haasan: 19 నుంచి కమల్‌హాసన్‌ ప్రచారం

ప్యారీస్‌(చెన్నై), ఫిబ్రవరి 11: ‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌(Kamal Haasan) ఈ నెల 19వ తేదీ నుంచి ఈరోడ్డు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. కరుంగళ్‌పాలయం గాంధీ విగ్రహం సమీపంలో 19వ తేదీ సాయం త్రం ఐదు గంటలకు కమల్‌హాసన్‌ తన ప్రచారానికి శ్రీకారం చుడతారు. 5.30 గంటలకు సూరంపట్టి నాలుగు రోడ్ల కూడలి, 6 గంటలకు సంపత్‌నగర్‌లో రోడ్‌షోలో ప్రసంగిస్తారు. 6.30 గంటలకు వీరప్పన్‌ సత్రం, రాత్రి 7 గంటలకు అగ్రహారం ప్రాంతాల్లో ఇళంగోవన్‌కు మద్దతుగా ఓట్లు సేకరిస్తారు. కమల్‌తో కాంగ్రెస్‌, డీఎంకే తదితర మిత్రపక్షాలకు చెందిన నేతలు పాల్గొంటారు.

Updated Date - 2023-02-12T10:07:27+05:30 IST