G20 Summit: ట్రూడో గురించి బయటపడ్డ మరో చీకటి కోణం.. జీ20 సమ్మిట్‌లో ఏం చేశాడో తెలుసా?

ABN , First Publish Date - 2023-09-21T18:03:05+05:30 IST

భారతదేశంపై కెనడాకు ఎంత కోపం, అసూయ ఉందో మెల్లమెల్లగా బయటపడుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందడానికి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని...

G20 Summit: ట్రూడో గురించి బయటపడ్డ మరో చీకటి కోణం.. జీ20 సమ్మిట్‌లో ఏం చేశాడో తెలుసా?

భారతదేశంపై కెనడాకు ఎంత కోపం, అసూయ ఉందో మెల్లమెల్లగా బయటపడుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందడానికి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందే.. భారత్‌ని నిందించేందుకు గట్టిగానే ప్లాన్స్ వేసుకున్నట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని.. అమెరికాతో పాటు ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్‌లోని మిత్రదేశాల ను కోరింది. అయితే.. కెనడా వినతిని ఈ దేశాలు తిరస్కరించడంతో, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడు లేటెస్ట్‌గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలోని మరో చీకటి కోణం బయటపడింది. పదండి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం..


ఇటీవల ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సమావేశాలను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాల అధినేతలు, అధికారులు కలుపుకొని మొత్తం 30కి పైగా అగ్రనేతలు హాజరయ్యారు. వీరికి ఎలాంటి లోటు లేకుండా.. మన ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. విలాసవంతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా.. దేశాధినేతల సౌకర్యం కోసం లగ్జరీ హోటళ్లలో ప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం, అలాగే గ్లోబల్ లీడర్ కోరుకునే విధంగా.. భారత భద్రతా ఏజెన్సీలచే ఇవి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. అందరూ తమకు కేటాయించిన సూట్లను వినియోగించుకున్నారు కానీ.. కెనడా ప్రధాని ట్రూడో మాత్రం పెసిడెన్షియల్ సూట్‌లో ఉండేందుకు అంగీకరించలేదు. అదే హోటల్‌లో సాధారణ గదిలో బస చేశారు. అతని ప్రతినిధి బృందం సైతం.. VVIP హోటళ్లను కాదని, సాధారణ రూంలలోనే గడిపాయి. తమ ఖర్చు తగ్గించుకోవడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ట్రూడో ఏజెన్సీలు తెలిపాయి కానీ, ట్రూడో ఎందుకు సాధారణ గదిలో ఉన్నారన్న దానిపై మాత్రం వివరణ లేదు. చూస్తుంటే.. ఇక్కడ భారత్‌ని నిందించే కోణమే కనిపిస్తోంది.

ఇదిలావుండగా.. ఈ ఏడాది జూన్ 18వ తేదీన భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలో హత్యకావింపబడ్డాడు. అప్పటినుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ దాడుల్ని తీవ్రం చేశారు. అటు.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని ట్రూడో ఆరోపణలు చేశారు. అలాగే.. ఈ అంశంలో భారత దౌత్యాధికారిని బహిష్కరించారు. దీంతో.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటు, కెనడా చేసిన పనికి భారత్ కూడా గట్టి సమాధానమే ఇచ్చింది. ట్రూడో ఆరోపణలు అసంబద్ధమైనవని ఖండిస్తూ.. ఇక్కడున్న కెనడా దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

Updated Date - 2023-09-21T18:03:05+05:30 IST