Jagdish Shetter: నా రాజకీయ జీవనంలో కొత్త అధ్యాయం

ABN , First Publish Date - 2023-06-25T11:14:29+05:30 IST

రాజకీయ జీవనంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఎమ్మెల్సీగా ఎన్నికైన జగదీశ్‌శెట్టర్‌(Jagdish Shetter) అభిప్రాయపడ్డారు. హుబ్బళ్ళి

Jagdish Shetter: నా రాజకీయ జీవనంలో కొత్త అధ్యాయం

- సభాపతి అంశం పార్టీ నేతల ఇష్టం: శెట్టర్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజకీయ జీవనంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఎమ్మెల్సీగా ఎన్నికైన జగదీశ్‌శెట్టర్‌(Jagdish Shetter) అభిప్రాయపడ్డారు. హుబ్బళ్ళిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధానపరిషత్‌లో పనిచేసే అవకాశం దొరికిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు బాధ్యత, అవకాశం ఇచ్చిందన్నారు. పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలన్నారు. ఎమ్మెల్సీని చేసే సందర్భంలో పార్టీ తనకు మరింత ఉన్నతమైన హోదా కల్పిస్తామని చెప్పిందన్నారు. అయితే సభాపతి హోదా ఇస్తారనే విషయం ప్రస్తావించలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎటువంటి బాధ్యత అప్పగించినా సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ అగ్రనేతలతో చర్చిస్తానని, ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలని సూచించినా అందుకు కట్టుబడతానని తెలిపారు. ఉత్తరకర్ణాటకలో 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని, వీటిలో ఆరేడు స్థానాలు గెలిచే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఉత్తర కర్ణాటకలో కీలకమైన సమస్యలపై పరిషత్‌లో చర్చిస్తానన్నారు. బీజేపీలో అసంతృప్తి పెరుగుతోందని, ఎప్పుడు పేలుతుందో చెప్పలేమన్నారు. అడ్జ్‌స్టమెంట్‌ పాలిటిక్స్‌ గురించి ఎంపీ ప్రతాప్‏సింహ ప్రస్తావించారని, మరిన్ని వివరాలు చెబితే బాగుంటుందన్నారు.

Updated Date - 2023-06-25T11:14:29+05:30 IST