ISIS-linked terror module : జబల్పూరులో ఎన్ఐఏ దాడులు.. ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టు.. ముగ్గురి అరెస్ట్..

ABN , First Publish Date - 2023-05-27T20:02:14+05:30 IST

దేశంలో హింసాత్మక పవిత్ర యుద్ధం (violent jihad) కోసం ప్రయత్నిస్తున్న ఓ ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టయింది. మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్

ISIS-linked terror module : జబల్పూరులో ఎన్ఐఏ దాడులు.. ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టు.. ముగ్గురి అరెస్ట్..
NIA

భోపాల్ : దేశంలో హింసాత్మక పవిత్ర యుద్ధం (violent jihad) కోసం ప్రయత్నిస్తున్న ఓ ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టయింది. మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సంయుక్తంగా జబల్పూరులో నిర్వహించిన దాడుల్లో ఈ దారుణం బయటపడింది. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది.

జబల్పూరులోని ఓమ్టి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 చోట్ల శుక్ర-శనివారాల మధ్య రాత్రి నిర్వహించిన దాడుల్లో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరులు సయ్యద్ మమూర్ అలీ, మహమ్మద్ అదిల్ ఖాన్, మహమ్మద్ షాహిద్‌లను అరెస్ట్ చేశారు. అదిల్ ఖాన్ నిర్వహిస్తున్న ఐసిస్ అనుకూల కార్యకలాపాల గురించి 2022 ఆగస్టులో ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. ఎన్ఐఏ అతనిపై రెండు రోజుల క్రితం కేసును నమోదు చేసింది. అరెస్టయిన ముగ్గురిని భోపాల్‌లోని ఎన్ఐఏ కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120బీ, 295ఏ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ ముగ్గురిని జూన్ 3 వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఎన్ఐఏ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురి నుంచి పదునైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నేరారోపణ చేయదగిన పత్రాలు, డిజిటల్ డివైసెస్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదిల్, అతని అనుచరులు సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ ప్రచారాన్ని వ్యాపింపజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వీరు క్షేత్ర స్థాయిలో మసీదులు, ఇళ్లలో కూడా కార్యక్రమాలను నిర్వహించి ఐసిస్ భావజాలాన్ని ప్రచారం చేసినట్లు తెలిసింది. ఐసిస్ ఆదేశాల మేరకు భారత దేశంలో హింసాత్మక ఉగ్రవాద దాడులు చేయడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. జబల్పూరులోని చట్టవిరుద్ధ ఆయుధాల సరఫరాదారుతో వీరు సంబంధాలను ఏర్పరచుకున్నట్లు, పిస్తోళ్లు, ఐఈడీలు, గ్రెనేడ్లను సంపాదించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి :

Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Updated Date - 2023-05-27T20:02:14+05:30 IST