Share News

Railway News: 2027 నాటికి ప్రతి ప్రయాణీకుడికి కన్ఫర్మ్ టిక్కెట్.. రైల్వే ప్లాన్ ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2023-11-16T20:32:58+05:30 IST

రైల్వే శాఖ(Indian Railways) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.

Railway News: 2027 నాటికి ప్రతి ప్రయాణీకుడికి కన్ఫర్మ్ టిక్కెట్.. రైల్వే ప్లాన్ ఏంటో తెలుసా..

ఢిల్లీ: రైల్వే శాఖ(Indian Railways) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.

ప్రయాణికులందరూ 2027 నాటికి పక్కాగా టిక్కెట్ పొంది రైళ్లలో ప్రయాణించవచ్చని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రైల్వేల విస్తరణ ప్రణాళికలలో ప్రతిరోజూ కొత్త రైళ్లు(Trains) అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

దీపావళి సందర్భంగా ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఛట్ పూజ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించి 40 ఏళ్ల వ్యక్తి జారిపడి మరణించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు రైల్వే శాఖ దృష్టికి వెళ్లాయి. పండుగల సందర్భంగా సొంతూళ్లకు పయనమయ్యే వారితో రైల్వే, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది.


దీనికి శాశ్వత పరిష్కారంగా ఏటా 4 వేల నుంచి 5 వేల కొత్త ట్రాక్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 10,748 రైళ్లు నడుస్తుండగా ఆ సంఖ్యను 13 వేలకు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించారు.

భారతీయ రైళ్లలో ఏటా 800 కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సంఖ్యను వెయ్యి కోట్లకు పెంచాలని ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. సమయానికి స్టేషన్ కి చేరుకోవడం, రైలు ప్రమాదాలు తగ్గించడం, కొత్త ట్రాక్ లు వేయడం, రైళ్ల సగటు వేగాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీ నుంచి కోల్‌కతా ప్రయాణంలో రైలు త్వరణం, వేగాన్ని పెంచితే 2 గంటలకుపైగా టైం సేవ్ అవుతుంది. ఏటా దాదాపు 225 రైళ్లు భారత్ లో తయారవుతున్నాయి.

వీటిలో పుష్ పుల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. వందే భారత్(Vande Barath) రైళ్ల యాక్సిలరేషన్, డీసెలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువని అధికారులు చెప్పారు.

Updated Date - 2023-11-16T20:33:01+05:30 IST