Monsoon: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2023-05-26T17:14:52+05:30 IST

దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1వ తేదీ కంటే ముందు దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు తక్కువని చెప్పింది. జూన్ 4వ తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు వేశిస్తున్నాయని అంచనా వేసింది.

Monsoon: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం(Normal rainfall) నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. జూన్ 1వ తేదీ కంటే ముందు దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు తక్కువని చెప్పింది. జూన్ 4వ తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతంలో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, రుతుపవనాలు సాధారణంగా కంటే 92 శాతం తక్కువగా రావడంతో వాయవ్య ప్రాంతంలో వర్షాలు కొద్దిగా తక్కువగా ఉంటాయని అంచనా వేసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ముందుగు సాగేందుకు అనుకూల పరిస్థితి ఉందని తెలిపింది.

''దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు, నార్త్ ఇండియాలోని ఐసొలేటెడ్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుంది'' అని ఐఎండీ ఎన్విరాన్‌మెంట్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్‌సీ) చీఫ్ డి.శివానంద పాయ్ తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడినప్పటికీ నైరుతి రుతుపవనాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పారు.

Updated Date - 2023-05-26T18:11:53+05:30 IST