Share News

Pralay Missile: 'ప్రళయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2023-11-07T17:42:54+05:30 IST

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం సిద్ధమవుతోంది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్'ను మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.

Pralay Missile: 'ప్రళయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం సిద్ధమవుతోంది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (SRBM) 'ప్రళయ్' (Pralay)ను మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.


దేశ రక్షణావసరాలు, సరిహద్దుల్లో పటిష్ట భద్రత కోసం రూపొందించిన ఈ క్షిపణని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అభివృద్ధి చేసింది. ఇది 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది 500 నుంచి 1000 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది. ప్రళయ్ క్షిపణిని చైనా 'డాంగ్ ఫెంగ్ 12', ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన Iskanderతో పోల్చవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2023-11-07T17:42:55+05:30 IST