మెట్రో రైల్వే ప్రమాదాల్లో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-21T12:50:22+05:30 IST

బెంగళూరు నగరంలో మెట్రో రైల్వే ప్రాజెక్టు(Metro Railway Project)లు ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పలు ప్రమాదాల్లో

మెట్రో రైల్వే ప్రమాదాల్లో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో తెలిస్తే..

- రూ.3.15 కోట్ల పరిహారం ఇచ్చాం

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో మెట్రో రైల్వే ప్రాజెక్టు(Metro Railway Project)లు ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పలు ప్రమాదాల్లో 38 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. బెంగళూరు(Bangaluru) నగర ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న ఆయన విధానపరిషత్‌లో జేడీఎస్‌ సభ్యుడు టీఏ శరవణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి రూ.3.15 కోట్ల మేరకు పరిహారం అందించామన్నారు. కాగా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల కారణంగా బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Bangalore Metro Rail Corporation Limited)లోని ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్‌ చేశామని, అదే విధంగా కాంట్రాక్టర్లకు రూ.1.77 కోట్ల మేరకు జరిమానా విధించామని సీఎం వెల్లడించారు. మెట్రో రైలు మార్గాల నిర్మాణ సమయంలో సురక్షతకు పెద్దపీటవేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మెట్రో నిర్మాణ మార్గాలలో ప్రయాణిలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా అధికారులకు సూచించామని ఆయన వివరించారు.

Updated Date - 2023-02-21T12:50:24+05:30 IST