Share News

Brij Bhushan: డబ్ల్యూఎఫ్ఐతో నాకు ఎలాంటి సంబంధం లేదు: బ్రిజ్ భూషణ్

ABN , Publish Date - Dec 24 , 2023 | 04:55 PM

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త బాడీని సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్ణయం తీసుకోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బ్రిజ్ భూషణ్ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను రెజ్లింగ్‌ నుంచి రిటైర్ అయ్యానని, ఎన్నికలు వచ్చాయని, ఇప్పుడు ప్రతీదీ కొత్త ఫెడరేషన్ చూసుకుంటుందని చెప్పారు.

Brij Bhushan: డబ్ల్యూఎఫ్ఐతో నాకు ఎలాంటి సంబంధం లేదు: బ్రిజ్ భూషణ్

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)తో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త బాడీని సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్ణయం తీసుకోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బ్రిజ్ భూషణ్ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను రెజ్లింగ్‌ నుంచి రిటైర్ అయ్యానని, ఎన్నికలు వచ్చాయని, ఇప్పుడు ప్రతీదీ కొత్త ఫెడరేషన్ చూసుకుంటుందని చెప్పారు. సంజయ్ సింగ్ తన బంధువేమీ కాదని చెప్పారు. రెజ్లింగ్ నేషనల్స్‌ను కనీసం ఢిల్లీలోనైనా జరపాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇందువల్ల పిల్లలు ఈ ఏడాది నష్టపోరని తెలిపారు.


సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా డబ్ల్యూఎఫ్ఐ కొత్త బాడీ గత గురువారంనాడు ఏర్పడింది. ఆ వెంటనే అండర్-15, అండర్-20 నేషనల్స్‌ను గోండా (యూపీ)లోని నందిని నగర్‌వో ఈ ఏడాది చివర్లో ఏర్పాటు చేస్తామని సంజయ్ సింగ్ ప్రకటించారు. ఇది తొందరపాటు నిర్ణయమని, రెజ్లర్లకు అవసరమైన గడువు (నోటీసు) ఇవ్వకుండా ఈ నిర్ణయం ప్రకటించారని క్రీడా శాఖ ఆదివారంనాడు తప్పుపట్టింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డిసెంబర్ 21న డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. సాక్షిమాలిక్ తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా, భజ్‌రంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 04:57 PM