Hero Vishal: విజయ్‌ పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్‌ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-08-30T08:19:29+05:30 IST

ఇలయదళపతి విజయ్‌(Ilayadalapathi Vijay) రాజకీయ ప్రవేశం చేస్తే ఆయన్ని మనసారా అభినందిస్తానని ప్రముఖ నటుడు

Hero Vishal: విజయ్‌ పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్‌ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఇలయదళపతి విజయ్‌(Ilayadalapathi Vijay) రాజకీయ ప్రవేశం చేస్తే ఆయన్ని మనసారా అభినందిస్తానని ప్రముఖ నటుడు విశాల్‌(Actor Vishal) వ్యాఖ్యానించారు. మంగళవారం 46వ జన్మదిన వేడుకలను జరుపుకున్న విశాల్‌.. తొలుత కోయంబేడులో అభిమానుల మధ్య భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తల్లి కోయంబేడు మార్కెట్‌లోనే కాయగూరలు, పూలు కొంటారని, ఇక్కడి కార్మికులు బాగా శ్రమిస్తారని అన్నారు. 19 యేళ్లుగా తనను హీరోగా ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదేవిధంగా పురుషవాక్కం, ట్రిప్లికేన్‌, కోడంబాక్కం ప్రసవ ఆసుపత్రుల్లో మంగళవారం జన్మించిన పసికందులకు బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కీల్పాక్‌లోని అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ బస చేసున్న చిన్నారుల మధ్య కేక్‌ కట్‌ చేసి అందరికీ తినిపించారు. అటుపిమ్మట ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వంలో నటించనున్న కొత్త తమిళ చిత్రం యూనిట్‌ సభ్యుల మధ్య కూడా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

nani3.jpg

భారీ కేక్‌ను కట్‌ చేసి దర్శకుడు హరికి, కమెడియన్‌ యోగిబాబు, ఇతర యూనిట్‌ సభ్యులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 45 యేళ్లకు ముందు సూపర్‌స్టార్‌ టైటిల్‌ పొందిన రజనీకాంత్‌(Rajinikanth) ఇప్పటికీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. ఇక యువనటుడు, తన చిరకాల మిత్రుడు విజయ్‌ నిర్విరామంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశం చేస్తే తాను మనసారా ఆయన అభినందించి స్వాగతిస్తానని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అవార్డులపై ప్రస్తావిస్తూ ఏదో నలుగురైదుగురు ఓ చోట కూర్చుని అవార్డులు ఎంపిక చేయడం సబబు కాదని, ప్రజలు, అభిమానులు ఇచ్చే ఆదరణే అవార్డులని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-30T08:19:31+05:30 IST