Gali Janardhan Reddy: అంజనాద్రి గురించి గాలి జనార్దన్‌ రెడ్డి చెప్పిన మాటలు వింటే...

ABN , First Publish Date - 2023-03-21T11:59:50+05:30 IST

కేఆర్‌పీపీ అధికారంలోకి వస్తే అంజనాద్రి పర్వతం అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు కేటాయిస్తామని కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు గాలి జనార్దన్‌ రెడ్డి

Gali Janardhan Reddy: అంజనాద్రి గురించి గాలి జనార్దన్‌ రెడ్డి చెప్పిన మాటలు వింటే...

గంగావతి(బెంగళూరు): కేఆర్‌పీపీ అధికారంలోకి వస్తే అంజనాద్రి పర్వతం అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు కేటాయిస్తామని కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు గాలి జనార్దన్‌ రెడ్డి (Gali Janardhan Reddy) హామీ ఇచ్చారు. గంగావతిలోని నగరసభ కార్యాలయం ముందు ఆదివారం రాత్రి కేఆర్‌పీపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో గాలి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిస్తే బైపాస్‌ రోడ్డు వేసేందుకు, అభివృద్ధి పనులకు, రోడ్ల విస్తరణ చేసేందుకు, గంగావతి నగరంలో సూపర్‌ స్ఫెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు, ఆనెగొందిలో వుండే అంజనాద్రి పర్వతం అభివృద్ధి పనులకు ఐదు సంవత్సరాలకు రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. వీది వీధి వ్యాపారస్తులకు సుందరమైన దుకాణాలను కట్టించి ఇస్తానన్నారు. అదేవిధంగా నగరానికి వచ్చినటువంటి అస్సాం ముఖ్యమంత్రి ముస్లింల మదరసాలను మూసివేయాలని తెలియజేశారు. హిందుముస్లింలు అన్నదమ్ముల్లా మెలగాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటానన్నారు. జనార్దన్‌ రెడ్డి బళ్లారికి వెళ్లిపోతాడని మాట్లాడుతున్నారు. బళ్లారి(Bellary) ఏమీ ఇటలీలో లేదని గంగావతికు 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వుందన్నారు. తాను గంగావతి(Gangavati)కి రాజకీయం చేసేందుకు రాలేదని ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చడానికి సేవకుడిగా వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గప్ప దళపతి, మనోహర్‌ గౌడ, మస్తాన్‌ సాబ్‌, అమరజ్యోతి నరసప్ప, సయ్యద్‌ అలీ, శకుంతల, శ్రీనివాసగౌడ, హుస్సేన్‌ బాషా, కేఆర్‌పీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T11:59:50+05:30 IST