Gali Janardhan Reddy: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది: గాలి

ABN , First Publish Date - 2023-03-26T08:52:10+05:30 IST

రాష్ట్రంలో అవినీతి, అభివృద్ధిలో వెనకబాటుతనం రాజ్యమేలుతున్నాయని, కేఆర్‌పీపీ గెలుపుతోనే సమూల మార్పులు సాధ్యమ

Gali Janardhan Reddy: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది: గాలి

గంగావతిరూరల్‌(బెంగళూరు): రాష్ట్రంలో అవినీతి, అభివృద్ధిలో వెనకబాటుతనం రాజ్యమేలుతున్నాయని, కేఆర్‌పీపీ గెలుపుతోనే సమూల మార్పులు సాధ్యమని కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) వెల్లడించారు. గంగావతిలోని విఠలాపురం గ్రామంలో అభిమానులు ఆయనకు ప్రజలు హారతులుపట్టి స్వాగతం పలికారు. ఈసందర్భంగా గాలి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్‌పీపీలో ప్రజాభీష్టానికి అనుగుణంగా పని చేస్తామన్నారు. సిద్దికేరి గ్రామంలో కరికల్లప్ప క్యాంపులో మాట్లాడుతూ తాను గెలిచిన అనంతరం సంవత్సరంలోపు అందరికీ ఇంటి హక్కు పత్రాలను అందజేస్తామన్నారు. ఆగోలి గ్రామంలో యువకులకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రూ. 5 కోట్లతో టెక్స్‌టైల్‌ రెడిమేడ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. మరియు మహిళలకు స్త్రీశక్తి సహాయ గుంపుల విద్యార్థులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. బసవేశ్వర ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి కలిగే ఖర్చు రూ. వెయ్యి అయితే రూ. 20 లక్షల వరకు అయ్యే ఆరోగ్య సమస్యలకు కూడా పథకంలో ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాతలకు ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఉచితంగా అందించడంతో పాటు ప్రతి రోజూ వ్యవసాయం చేసుకునే వారికి 9 గంటల విద్యుత్‌ ఉచితంగా అందిస్తానన్నారు. ఈసారి కేఆర్‌పీ పార్టీని గెలిపించాలని, ప్రజా సేవలకు తాను సిద్దంగా వున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్‌ గౌడ, గురురాజు, వెంకటేష్‌ ఆచారి, అశోక్‌ గౌడ, ప్రభాకర్‌, గురురాజు, ఉలిగమ్మ, సోనాబాయి, సరస్వతి, లింగమ్మ, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T08:52:10+05:30 IST