Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-03-19T09:55:24+05:30 IST
ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్)కి వ్యతిరేకమని, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవిని జేబుదొంగలా

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్)కి వ్యతిరేకమని, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవిని జేబుదొంగలా తన్నుకెళ్లే రీతిలో ఎన్నికల తంతు జరుగుతోందని అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) ధ్వజమెత్తారు. చెన్నైలో శనివారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం అన్నాడీఎంకేలో పార్టీ నియమ నిబంధనలు ఏమాత్రం తెలియనివారే పార్టీ పగ్గాల కోసం ఆరాట పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడకు వెళ్ళినా ఈపీఎస్‌కు వ్యతిరేక పవనాలే వీస్తున్నాయన్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి కేసు న్యాయస్థానం విచారణలో ఉండగానే ఆ పదవికి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏ మొచ్చిందని ప్రశ్నించారు. ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో పెద్ద మనస్సుతో తాను రెండాకుల గుర్తు స్తంభించకుండా పోటీ నుంచి విరమించుకున్నామని ఆయన చెప్పారు. తనను, తన అనుచరులను పార్టీ నుంచి తొలగించే అధికారం ఈపీఎస్(EPS) వర్గానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకే(AIADMK) సర్వసభ్యమండలి సమావేశం తనకు చేదు అనుభవాన్ని కలిగించిందని, వాటర్ బాటిల్‌ను చూస్తేనే అలెర్జీగా ఉంటోందని ఓపీఎస్ అన్నారు. అన్నాడీఎంకే శ్రేణులంతా తమ వైపే ఉన్నారని, వారిని సమైక్యపరిచే దిశగానే తాను ఏప్రిల్ రెండో వారంలో తిరుచ్చిలో పార్టీ మహానాడును భారీ యెత్తున నిర్వహించనున్నామని ఓపీఎస్ ప్రకటించారు.