Former Chief Minister: ఆ పిటిషన్‌ను మాజీ సీఎం వెనక్కి తీసుకున్నారోచ్..

ABN , First Publish Date - 2023-03-02T11:14:05+05:30 IST

ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) వెనక్కు

Former Chief Minister: ఆ పిటిషన్‌ను మాజీ సీఎం వెనక్కి తీసుకున్నారోచ్..

పెరంబూర్‌(చెన్నై): ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) వెనక్కు తీసుకున్నారు. పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న దస్తా వేజుల ఆధారంగా, ఓపీఎస్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. 2015-16 సంవత్సరానికి రూ.20 లక్షలు, 2017-18 సంవత్సరానికి రూ.82.12 కోట్లు పన్నుగా చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసుపై స్టే విధించడంతో పాటు రద్దు చేయాలని కోరుతూ ఓపీఎస్‌(OPS) దాఖలు చేసిన పిటిషన్‌ను విచా రించిన మద్రాసు హైకోర్టు, నోటీసుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఆదా యపు పన్ను శాఖ అసెస్‌మెంట్‌ ఆర్డర్‌ సహా అన్ని ప్రక్రియలు కేసులో తుది తీర్పుకు లోబడి ఉంటాయనింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు విచారణ బుధవారం న్యాయమూర్తి అబ్దుల్‌ ఖుద్దూస్‌ చేపట్టగా, ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు వ్యతిరేకంగా దాఖలుచేసిన పిటిషన్‌ వెనక్కు తీసుకుంటున్నట్టు ఓపీఎస్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వాదన పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషన్‌ వెనక్కు తీసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2023-03-02T11:14:05+05:30 IST