Flight services: సింగపూరు నుంచి మదురైకి విమానసేవలు

ABN , First Publish Date - 2023-05-26T12:50:33+05:30 IST

సింగపూరు నుంచి మదురైకి విమాన సేవలు ప్రారంభించేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రక

Flight services: సింగపూరు నుంచి మదురైకి విమానసేవలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సింగపూరు నుంచి మదురైకి విమాన సేవలు ప్రారంభించేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. గురువారం ఉదయం ఆయన సింగపూరు హోం, న్యాయశాఖల మంత్రి కె.షణ్ముగం(Minister K. Shanmugam)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో వచ్చే యేడాది జనవరిలో జరుగనున్న విదేశీ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనాలని స్టాలిన్‌ అతడిని ఆహ్వానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక సేవా సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో సింగపూరు ప్రభుత్వం సాంకేతికపరమైన సహాయ సహకారాలను కూడా అందించాలని కోరారు. ఈ సందర్భంగా సింగపూరు హోంమంత్రి షణ్ముగం మాట్లాడుతూ... సింగపూరు నుంచి మదురైకి విమాన సేవలు ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయమై స్టాలిన్‌ చొరవ తీసుకుని భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. వీలైనంత త్వరగా మదురైకి విమాన సేవలు ప్రారంభించేలా చేస్తానని స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఇరై అన్బు, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి ఎస్‌. కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

తమిళ ప్రొఫెసర్‌తో భేటీ...

సింగపూరుకు చెందిన తమిళ పండితుడు ప్రొఫెసర్‌ శుభ తిన్నప్పన్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) గురువారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా తిన్నప్పన్‌ మాట్లాడుతూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం తమిళభాషాభివృద్ధి చేస్తున్న సేవలను ప్రశంసించారు. కీళడి పురావస్తు తవ్వకాలు తమిళ ప్రాచీన సంస్కృతిని, తమిళ భాష గొప్పదనాన్ని భావితరాలకు ఎలుగెత్తి చాటుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను తెలిపే ‘ఉంగలిల్‌ ఒరువున్‌’ మొదటి సంపుటిని స్టాలిన్‌ ఆయనకు కానుకగా అందజేశారు.

జపాన్‌కు పయనం...: ముఖ్యమంత్రి స్టాలిన్‌ మూడు రోజుల సింగపూరు పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం జపాన్‌ బయలుదేరి వెళ్ళారు. శుక్రవారం ఉదయం ఆయన జపాన్‌లోని పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

nani12.2.jpg

Updated Date - 2023-05-26T12:50:33+05:30 IST