Aeronics Internet: కంపెనీ ఎండీ, సీఈవోలను ఆఫీస్‌లోనే హత్య చేసిన మాజీ ఉద్యోగి.. కారణం ఏంటో తెలుసా!
ABN , First Publish Date - 2023-07-11T20:27:54+05:30 IST
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిక్రితం స్థాపించిన ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ (Aeronics Internet Company) మేనేజింగ్ డైరెక్టర్ (MD), సీఈవోలను (CEO) కంపెనీ మాజీ ఉద్యోగి హత్య చేశాడు. నిందితుడు ఆఫీస్‌లోకి దూసుకెళ్లి ఖడ్గంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో విను కుమార్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వివరాలు తెలియజేశారు. నిందితుడు ఫెలిక్స్ (Felix) పరారీలో ఉన్నాడని బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిక్రితం స్థాపించిన ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ (Aeronics Internet Company) మేనేజింగ్ డైరెక్టర్ (MD), సీఈవోలను (CEO) కంపెనీ మాజీ ఉద్యోగి హత్య చేశాడు. నిందితుడు ఆఫీస్‌లోకి దూసుకెళ్లి ఖడ్గంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో విను కుమార్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వివరాలు తెలియజేశారు. నిందితుడు ఫెలిక్స్ (Felix) పరారీలో ఉన్నాడని బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. కాగా ఫెలిక్స్‌కి కూడా ఇదే తరహా వ్యాపారం ఉందని సమాచారం. ఫణీంద్ర, విను కుమార్‌లు తన వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్నారని నిందితుడు చెబుతున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.