Election effect: ఇక.. బదిలీలు బంద్‌

ABN , First Publish Date - 2023-03-17T13:40:27+05:30 IST

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా బదిలీలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్‌ సెక్రటరీకి రాష్ట్ర ఎన్నికల కమిష

Election effect: ఇక.. బదిలీలు బంద్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా బదిలీలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్‌ సెక్రటరీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఘాటుగా లేఖ రాశారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మనోజ్‌కుమార్‌ మీనా(Manoj Kumar Meena) లేఖను పంపారు. ఇటీవల పలు శాఖలకు చెందిన అధికారుల బదిలీలపై కమిషనర్‌ తీవ్రంగా స్పందించారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ జోరందుకుందని ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సహా ముగ్గురు కీలక అధికారులు ఏర్పాట్లపై రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుందని ఇటువంటి పరిస్థితిలో అధికారులు, ఉద్యోగుల బదిలీలు సరికాదని లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌కు సమాచారం లేకుండా ఇకపై ఏస్థాయికి చెందిన ఉద్యోగుల, అధికారులను బదిలీ చేయరాదని సూచించారు. ఇటీవల బదిలీలపై అభ్యంతరం తెలిపారు. ఈనెల 8వ తేదీనే బదిలీల విషయమై ముందస్తు సూచనలు ఉండాలని సూచించినా సాగించిన తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని ప్రాధికారల ముఖ్యులకు ఆదేశాలు పంపాలని ఛీఫ్‌ సెక్రటరీకు సూచించారు. ఇకపై తమకు సమాచారం లేకుండా బదిలీలు చేస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్ళాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నుంచి లేఖ అందిన వెంటనే ఛీఫ్‌ సెక్రటరీ అన్నిశాఖల ముఖ్య అధికారులకు సందేశాలు పంపారు. దీంతో మరో మూడునెలల పాటు రాష్ట్రంలో ఏశాఖకు చెందిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు ఉండవు. అదేజరిగితే వారిపై చర్యలు ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-03-17T13:40:27+05:30 IST