Share News

Prakash Raj : రూ. 100 కోట్ల స్కామ్‌లో నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2023-11-23T19:53:24+05:30 IST

ED Summons To Prakash Raj : టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Prakash Raj : రూ. 100 కోట్ల స్కామ్‌లో నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్‌కి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో 100 కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్‌ను విచారించాల్సి ఉందని.. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ప్రణవ్ జ్యువెలర్స్ నుంచి ఆయన అందుకున్న చెల్లింపుల వివరాలను పొందడానికే ఈ సమన్లు అందజేయడం జరిగింది. ఈ ప్రకటనకు గాను నటుడు ప్రకాష్‌కు సంస్థ గట్టిగానే ముట్టజెప్పిందని ప్రచారం జరుగుతోంది. అయితే.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం, మీడియా మీట్‌లు పెట్టి ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇలా ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు లేకపోలేదు.


Enforcement-Directorate.jpg

అసలేం జరిగింది..?

ప్రణవ్ జ్యువెలర్స్‌ సంస్థ పోంజీ స్కీమ్ ద్వారా అధిక లాభాలు చూపి వంద కోట్లు వసూలు చేసింది. అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది. దీంతో సంస్థ యజామాని మదన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్‌లు, యజమానులపై నవంబర్-20న ఈడీ సోదాలు చేసింది. ఈ క్రమంలోనే జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, పలు బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వంద కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. సోదాల తర్వాత మదన్ అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తారు..? విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-11-23T20:00:46+05:30 IST