IndiGo: ఇండిగో ఎయిర్ హోస్టెస్‌పై విమాన ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన...స్వీడిష్ జాతీయుడి అరెస్ట్

ABN , First Publish Date - 2023-04-01T11:07:09+05:30 IST

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించిన ఘటన...

IndiGo: ఇండిగో ఎయిర్ హోస్టెస్‌పై విమాన ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన...స్వీడిష్ జాతీయుడి అరెస్ట్
Indigo Airlines flight

ముంబయి: ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు.బ్యాంకాక్‌ నుంచి ముంబయికు వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను(IndiGo air hostess) లైంగికంగా వేధించిన ఘటన సంచలనం రేపింది.(Drunk Swedish flyer) పీకల దాకా మద్యం తాగిన స్వీడిష్ జాతీయుడు(62) బ్యాంకాక్ లో ఇండిగో విమానం ఎక్కి 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడు.6 ఈ 1052 ఇండిగో విమానంలో భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్ట్‌బర్గ్ ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించాడు.దీంతోపాటు సహ ప్రయాణికుడిపై దాడి చేసి(assaults co-passenger) విమానంలో అల్లకల్లోలం సృష్టించాడు.ఈ కేసులో నిందితుడైన స్వీడిష్ జాతీయుడు క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు చికెన్ డిష్ తీసుకొని, డబ్బు చెల్లించడానికి ఎయిర్ హోస్టెస్ పిఓఎస్ మెషీన్‌తో అతన్ని సంప్రదించినప్పుడు, కార్డ్ స్వైప్ చేయాలనే సాకుతో జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ అనుచితంగా ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకున్నాడు.తనను వేధించాడని ఎయిర్ హోస్టెస్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఇతర ప్రయాణికులను కూడా దుర్భాషలాడాడని ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది.నిందితుడిని ముంబయివిమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి : Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

భారతదేశంలో గత మూడు నెలల్లో విమానాల్లో జరిగిన 8వ వికృత ఘటన. ఆదివారం ఇండిగో గౌహతి-ఢిల్లీ విమానంలో తాగిన ప్రయాణికుడు వాంతులతోపాటు టాయిలెట్ చుట్టూ మలవిసర్జన చేశాడు. మార్చి 22వతేదీన దుబాయ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రయాణికులు జాన్ జార్జ్ డిసౌజా, దత్తాత్రేయ ఆనంద్ బాపర్డేకర్ మద్యం తాగడం మొదలుపెట్టారు. దీనిని గుర్తించిన క్యాబిన్ సిబ్బంది విమానంలో మద్యం తాగడంపై నిషేధం విధించినట్లు సమాచారం. అయితే నిందితులిద్దరూ ఆగ్రహానికి గురై తమ సీటుపై నుంచి లేచి మద్యం తాగి విమానంలో నడిచారు.మద్యం తాగి, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ వారిద్దరిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 26 వతేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధ మహిళపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు జైలుకు తరలించారు.

Updated Date - 2023-04-01T11:21:04+05:30 IST