Share News

EC: ఎన్నికల రాష్ట్రాల్లో తనిఖీలు.. రూ.1,760 కోట్ల డ్రగ్స్, నగదు, మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2023-11-20T16:37:38+05:30 IST

Delhi: దేశంలోని 5 రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల కమిషన్(Election Commission) అధికారుల తనిఖీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.

EC: ఎన్నికల రాష్ట్రాల్లో తనిఖీలు.. రూ.1,760 కోట్ల డ్రగ్స్, నగదు, మద్యం స్వాధీనం

ఢిల్లీ: దేశంలోని 5 రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల కమిషన్(Election Commission) అధికారుల తనిఖీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.

ఈ రాష్ట్రాల్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన సోదాల్లో దొరికిన ఆస్తుల కంటే ఇవి 7 రెట్లు ఎక్కువని పోల్ ప్యానెల్(Poll Panel) పేర్కొంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలలో ఎన్నికలు జరగ్గా, రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 25, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.


ఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటకల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.14 వందల కోట్లు పట్టుకున్నారు.

ఈ సారి టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుని పటిష్టమైన నిఘాను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. మిజోరాంలో 29.82 కోట్ల విలువైనా డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోల్ ప్యానెల్ వివిధ సేవలకు చెందిన 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది.

Updated Date - 2023-11-20T16:37:51+05:30 IST