Share News

Dr. K. Ponmudi: ఐదుసార్లు ఎమ్మెల్యే.. నిన్నటివరకు మంత్రి.. చివరకు జైలుకు

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:07 AM

ఆదాయానికి మించి అస్తుల సంపాదన కేసులో మూడేళ్ళ జైలుశిక్ష పడి మంత్రిపదవితో పాటు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన మాజీ మంత్రి డాక్టర్‌ కె.పొన్ముడి

Dr. K. Ponmudi: ఐదుసార్లు ఎమ్మెల్యే.. నిన్నటివరకు మంత్రి.. చివరకు జైలుకు

అడయార్‌(చెన్నై): ఆదాయానికి మించి అస్తుల సంపాదన కేసులో మూడేళ్ళ జైలుశిక్ష పడి మంత్రిపదవితో పాటు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన మాజీ మంత్రి డాక్టర్‌ కె.పొన్ముడి(Dr. K. Ponmudi) ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. విల్లుపురం, తిరుక్కోవిలూరు నియోజకవర్గాల్లో ఆయన శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. విల్లుపురం జిల్లాలోని తిరుక్కోవిలూరు టి ఎడైయార్‌ అనే గ్రామంలో 1950లో జన్మించిన పొన్ముడి, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో పీజీ డిగ్రీని పూర్తిచేశారు. 1989 నుంచి డీఎంకేలో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన.. జిల్లా కార్యదర్శి నుంచి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. 1989లో విల్లుపురం స్థానంలో పోటీ చేసిన ఆయన తొలిసారి శాసనసభకు ఎంపికయ్యారు. 1991లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1996, 2001 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలుపొందారు. 2011లో ఓటమి పాలైన ఆయన 2016లో తిరుక్కోవిలూరు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2021లో కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించడమేకాకుండా, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖామంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల సంపాదన కేసులో ఆయనకు మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించడంతో ప్రజా ప్రాతినిథ్య చట్టం మేరకు ఆయన తన మంత్రిపదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.

Updated Date - Dec 22 , 2023 | 08:07 AM