Share News

MK Stalin: పార్లమెంటు ఎన్నికల వరకూ గవర్నర్‌ను మార్చొద్దు.. సీఎం వ్యంగ్యం

ABN , First Publish Date - 2023-10-27T15:31:23+05:30 IST

పెట్రోల్ బాంబు‌ అంశంపై తమ ఫిర్యాదును స్థానిక పోలీసులు రిజిస్టర్ చేయలేదని రాజ్ భవన్ ఆరోపించడంతో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఎదురుదాడి చేశారు. పార్లమెంటరీ ఎన్నికల వరకూ ఆయనను (గవర్నర్) ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా మార్చవద్దంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.

MK Stalin: పార్లమెంటు ఎన్నికల వరకూ గవర్నర్‌ను మార్చొద్దు.. సీఎం వ్యంగ్యం

చెన్నై: పెట్రోల్ బాంబ్ (Petrol bomb) వ్యవహారం తిరిగి రాజ్‌భవన్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య చిచ్చు రేపుతోంది. డీఎంకేకు, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN.Ravi) మధ్య ఇప్పటికే పలు సందర్భాల్లో ఉప్పూనిప్పూ తరహా వాతావరణం నెలకొంది. తాజాగా పెట్రోల్ బాంబు‌ అంశంపై తమ ఫిర్యాదును స్థానిక పోలీసులు రిజిస్టర్ చేయలేదని రాజ్ భవన్ ఆరోపించడంతో గవర్నర్‌పై స్టాలిన్ శుక్రవారం ఎదురుదాడి చేశారు. పార్లమెంటరీ ఎన్నికల వరకూ ఆయనను (గవర్నర్) ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా మార్చవద్దంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.


''ఆయన అబద్ధాల పుట్ట. ద్రవిడం ఏమిటని ప్రశ్నించిన ఆయన వల్ల మాకు ఎన్నికల పరంగా లబ్ధి చేకూరుతుంది. గత రెండు రోజులుగా ఆయన (గవర్నర్) ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారో మీకందరికీ తెలిసిందే. నా వరకూ చెప్పాలంటే ఆయన అబద్ధాలు చెబుతుంటారు. ద్రవిడం అంటే ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఆయనను కనీసం వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకైనా మార్చవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని, హోం మంత్రి అమిత్‌ను నేను కోరుతున్నాను'' అని ఒక వార్తా సంస్థతో మాట్లాడుడూతూ స్టాలిన్ అన్నారు.


పెట్రోల్ బాంబు వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, దీనిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడానికి రాష్ట్ర పోలీసులు నిరాకరిస్తున్నారని రాజ్‌భవన్ గురువారంనాడు ఆరోపించింది. కాగా, పెట్రోల్ బాంబు కేసుపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Updated Date - 2023-10-27T15:31:23+05:30 IST