Department of Transport: విద్యార్థులు యూనిఫాంతో వస్తే బస్‌పాస్‌ అడగొద్దు

ABN , First Publish Date - 2023-06-01T07:23:09+05:30 IST

విద్యార్థులు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వస్తే వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించాలని రవాణా శాఖ(Department of Transport) ఆదే

Department of Transport: విద్యార్థులు యూనిఫాంతో వస్తే బస్‌పాస్‌ అడగొద్దు

పెరంబూర్‌(చెన్నై): విద్యార్థులు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వస్తే వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించాలని రవాణా శాఖ(Department of Transport) ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) డిపో మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేసింది. విద్యార్థినీ, విద్యార్థులు ఉచితంగా ప్రయాణం చేసేలా కొత్త బస్‌పాస్‌ అందజేసేందుకు వారి వివరాలు సేకరిస్తున్నామని, అనంతరం పాస్‌లు ముద్రించి, ల్యామినేషన్‌ చేసి అందించడంలో కొంత సమయం పట్టే అవకాశముందని పేర్కొంది. అయితే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 7వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున కొత్త బస్‌పాస్‌(Bus pass)లు అందజేసే వరకు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Updated Date - 2023-06-01T08:08:58+05:30 IST