Share News

Kejriwal Diwalit gift: 5000 మంది మున్సిపల్ ఉద్యోగుల పెర్మనెంట్

ABN , First Publish Date - 2023-11-01T14:09:11+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్‌ లో పనిచేసే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. 5,000 మంది కాంట్రాక్టు వర్కర్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తున్నట్టు బుధవారంనాడు ప్రకటించారు.

Kejriwal Diwalit gift: 5000 మంది మున్సిపల్ ఉద్యోగుల పెర్మనెంట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్‌ (MCD)లో పనిచేసే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల (Contract cleanliness workers)కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. 5,000 మంది కాంట్రాక్టు వర్కర్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తున్నట్టు బుధవారంనాడు ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, ఈ విధానానికి ముగింపు పలకాలనే సంకల్పంతో ఆప్ సర్కార్ మొదట్నించీ ఉందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు ఎంతో అవినీతి ఉండేదని, ఇప్పుడు ఉద్యోగులంతా సకాలంలో వేతనాలు పొందుతున్నారని చెప్పారు.


''మంగళవారంనాడు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిపాం. 5,000 మంది పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలనే ప్రతిపాదనను ఈ సమావేశంలో ఆమోదించాం. 2023 జనవరి నుంచి 6,494 మంది కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాం'' అని కేజ్రీవాల్ తెలిపారు. సీఎం ప్రకటనతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-11-01T14:09:11+05:30 IST