Pralay ballistice missiles: సైన్యం అమ్ములపొదిలో 'ప్రళయ్'...

ABN , First Publish Date - 2023-09-17T20:50:32+05:30 IST

భారత సైన్యం అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం చేరబోతోంది. 'ప్రళయ్' బాలిస్టిక్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చైనా, పాకిస్థాన్‌తో భారత్‌ను కలిపే ఎల్‌ఓసీ, ఎల్ఓసీ వెంబడి ఈ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను మోహరించనున్నారు.

Pralay ballistice missiles: సైన్యం అమ్ములపొదిలో 'ప్రళయ్'...

న్యూఢిల్లీ: భారత సైన్యం (India Armya) అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం చేరబోతోంది. 'ప్రళయ్' (Pralay) బాలిస్టిక్ క్షిపణల (ballistic missiles) కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చైనా, పాకిస్థాన్‌తో భారత్‌ను కలిపే ఎల్‌ఓసీ, ఎల్ఓసీ వెంబడి ఈ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను మోహరించనున్నారు.


''ఇండియన్ ఆర్మీ పరంగా ఇది చాలా కీలకమైన నిర్ణయం. 150 నుంచి 200 కిలోమీటర్ల లక్ష్యాలని ఛేదించగలిగే 'ప్రళయ్' బాలిస్టిక్ మిజైల్స్ సేకరించాలనే ఇండియన్ ఆర్మీ ప్రతిపాదనకు ఇటీవల జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆమోదం లభించింది'' అని రక్షణ శాఖ అధికారులు ఆదివారంనాడు తెలిపారు. సంప్రదాయ వార్‌హెడ్లతో ఈ మిజైల్స్‌ను ఇండియన్ ఆర్మీ మోహరించనుందని చెప్పారు. బాలిస్టిక్ మిజైల్స్‌ను టాక్టికల్ రోల్స్‌లో ఉపయోగించాలనే విధాన నిర్ణయానికి అనుగుణంగా 'ప్రళయ్' బాలస్టిక్ మిజైల్స్ సేకరణ మరో కీలక అడుగు కానుందని చెప్పారు. ఈ మిజైల్స్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అభివృద్ధి చేసిందని, సైన్యం కోరుకుంటే క్షిపణుల రేంజ్ పెంచుతూ మరింత అభివృద్ధి చేసేందుకు డీఆర్‌డీఏ సిద్ధంగా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. 2015లో మిజైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియ చేపట్టగా, దివంగత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హయాంలో ఇది మరింత ఊపందుకని క్షిపణుల రేంజ్‌ను మరింత డవలప్ చేశారు.

Updated Date - 2023-09-17T20:50:32+05:30 IST