Congress candidate: మెజారిటీ ఓట్లతో విజయం సాధిస్తా!
ABN , First Publish Date - 2023-02-12T08:01:42+05:30 IST
ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఓట్లతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్(Congress candida
- కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్
ప్యారీస్(చెన్నై), ఫిబ్రవరి 11 : ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఓట్లతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్(Congress candidate EVKS Ilangovan) ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే కూటమిలో తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈవీకేఎస్ ఇళంగవోన్‌ను శనివారం ఉదయం కుమ్మరులు, రజకులు, నాయి బ్రాహ్మణులు తదితర కుల వృత్తుల సంఘాల నాయకులు కలుసుకుని తమ మద్దతు ప్రకటించారు. ఈ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొని హస్తం గుర్తుకు ఓట్లు సేకరించనున్నట్లు సేమ నారాయణన్, సుబ్రమణ్యం, రామకృష్ణ, సేతురామన్ తదితర నాయకులు ప్రకటించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ తమ కుమారుడు తిరుమగన్ ఈవేరా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించి ఈ నియోజకవర్గం అభివృద్ధికి చేసిన కృషిని స్థానికులు మరచిపోలేదని, మిత్రపక్షాల నేతలు, కార్యకర్తలు, స్థానికులు మద్దతుతో తాను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తానని పేర్కొన్నారు.