LPG cylinder Price: ఈ నెలలో ఏకంగా రూ.83 తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. కానీ వాళ్లకు మాత్రమేనండోయ్..!

ABN , First Publish Date - 2023-06-01T13:08:08+05:30 IST

వ్యాపార వినియోగ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర తగ్గింది. అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతోంది.

LPG cylinder Price: ఈ నెలలో ఏకంగా రూ.83 తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. కానీ వాళ్లకు మాత్రమేనండోయ్..!

న్యూఢిల్లీ : వ్యాపార వినియోగ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర తగ్గింది. అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతోంది. జూన్ 1న సవరించిన ఈ ధరలను ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీంతో వ్యాపారస్థులకు కొంత వరకు ఉపశమనం లభించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా ఇలాంటి ఊరట కోసం ఎదురు చూస్తున్నారు.

ఇండియన్ ఆయిల్ కంపెనీ జూన్ 1న ప్రచురించిన ధరల ప్రకారం 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.83.50 తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో దీని ధర రూ.1,856.50 నుంచి రూ.1,773కు తగ్గింది. గత నెలలో వ్యాపార ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.172 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను యథాతథంగా కొనసాగించారు.

జూన్ 1న సవరించిన ధరల ప్రకారం కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,875.50 కాగా ముంబైలో రూ.1,725; చెన్నైలో రూ.1,937. సవరించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తారీకున ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. గృహ వినియోగ వంట గ్యాస్ ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పన్నులే. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ప్రభావం కూడా ఉంటుంది.

14.2 కేజీల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1,003; కోల్‌కతాలో రూ.1,029; ముంబైలో రూ.1,002.5; చెన్నైలో రూ.1,018.5. ఈ ధరలను 2022లో సవరించారు. గత ఏడాది నాలుగుసార్లు పెంచారు.

ఇవి కూడా చదవండి :

Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్‌.. తాడేపల్లిలో రిమోట్‌

Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే

Updated Date - 2023-06-01T13:08:08+05:30 IST