Cigarettes: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక సిగరెట్లు అమ్మాలంటే లైసెన్స్‌ ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2023-06-01T08:47:12+05:30 IST

అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై కేవలం అను

Cigarettes: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక సిగరెట్లు అమ్మాలంటే లైసెన్స్‌ ఉండాల్సిందే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై కేవలం అనుమతి (లైసెన్స్‌) ఉన్న దుకాణాల్లోనే సిగరెట్లు(Cigarettes), బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించేలా కొత్త చట్టం తీసురావాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్‌ వ్యాధి బారినపడి చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉన్నట్టు వైద్య గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో 1987 నుంచి యేటా మే 31న ‘వరల్డ్‌ టొబాకో డే’ను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కిరాణా షాపులు, టీ దుకాణాలు, చిన్నషాపుల్లో బీడీలు, సిగరెట్లు విక్రయిస్తున్నారు. దీంతో 18 యేళ్ళలోపు చిన్నారులు కూడా వాటిని యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారు. నిజానికి పొగాకు ఉత్పత్తులను విక్రయించేందుకు పలు కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, వీటిని ఏ ఒక్క దుకాణం యజమాని పాటించడం లేదు. ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరికీ విక్రయిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరికొత్త నిబంధనలు తీసుకుని రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, ఇకపై సిగరెట్లు, బీడీలను విక్రయించేందుకు ప్రత్యేకంగా లైసెన్స్‌ పొందేలా నిబంధనలు తీసుకురానుంది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా బీడీ, సిగరెట్ల విక్రయాలు ఉండబోవని ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. లైసెన్స్‌(License) పొందిన టీ దుకాణాల్లో కేవలం బీడీలు, సిగరెట్లు మినహా ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఒక వేళ ఈ నిబంధనల్ని ఎవరైనా వరుసగా అతిక్రమిస్తే దుకాణం లైసెన్సును కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదని, ఆ విధంగా ఈ నిబంధనలు రూపకల్పన చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

nani5.2.jpg

Updated Date - 2023-06-01T08:47:14+05:30 IST