Share News

Chief Minister: వరద బాధిత ప్రాంతాల్లో మరికొన్ని హెలికాప్టర్లు

ABN , Publish Date - Dec 20 , 2023 | 11:31 AM

దక్షిణాది జిల్లాలైన తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు మరికొన్ని హెలికాప్టర్లను కేటాయించాలని

Chief Minister: వరద బాధిత ప్రాంతాల్లో మరికొన్ని హెలికాప్టర్లు

- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు స్టాలిన్‌ లేఖ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దక్షిణాది జిల్లాలైన తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు మరికొన్ని హెలికాప్టర్లను కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం స్టాలిన్‌(CM Stalin) మంగళవారం లేఖ రాశారు. 1871 తర్వాత తిరునల్వేలి, తూత్తుకుడి(Thirunalveli, Thoothukudi) జిల్లాల్లో కుండపోత వర్షాలతో పెనుముప్పు వాటిల్లిందని, సుమారు 40 లక్షల మంది జలదిగ్బంధంలో అన్నపానీయాలు అందక అలమటిస్తున్నారని పేర్కొన్నారు. తామ్రభరణి నది పోటెత్తడంతో తూత్తుకుడి, శ్రీవైకుంఠం ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయని, కనెక్టింగ్‌ రోడ్లు వరదల్లో కొట్టుకుపోయిన కారణంగా సహాయాలను బాధితులకు సకాలంలో అందించలేకున్నామని తెలిపారు. ప్రస్తుతం వైమానికదళం నుంచి నాలుగు హెలికాప్టర్లు, నావికాదళం నుంచి రెండు హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్‌(Helicopters, Coast Guard) నుంచి రెండు హెలికాప్టర్ల ద్వారా సహాయకాలు అందజేస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో మరికొన్ని హెలికాప్టర్లను కేటాయిస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో వెళ్లి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగు సదుపాయాలు కల్పించవచ్చునని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 20 , 2023 | 11:32 AM